Thursday, January 14, 2021
[10/01, 20:08] Mucdigonda Senapati: Script by Tadikonda Sesibhushan. *శైవనిషేధములు*ప్రాయశ్చిత్త, ఉపవాస,సన్యాస, యతివందన, తీర్థయాత్రాగమనములు శైవులకు నిషేదింపబడినవి. శ్రీశైలాది పుణ్యక్షేత్రములకేగినపుడు ఇష్టలింగమునందే శ్రీ మల్లిఖార్జున స్వామిని భావించి పూజ చేసుకొని స్వామిని గుడిలో సందర్శింపనగును. అట్లే శంఖ తీర్థముతో శివుని అభిషేకించరాదు.శివపూజలోని ఈ క్రింది ధ్యానమంత్ర శ్లోకములకర్థము ప్రతి శైవుడూ ఆనందింపవలసి వున్నది - ( ఇవి విమలాగమమందలి పంచాక్షరీ కల్పములోనివి)"నమశ్శివాగ్ని బీజాయ హరాయపరమాత్మనే! ఓం మంతమంత్ర రూపాయ మూల పంచాక్షరాత్మనే!ఓంకారవదనాదేవీ వాయకార భుజద్వయీ ! శికార దేహ మధ్యాచ నమకార పదద్వయీ!పంచాక్షరీ పరావిద్యా సతారా లింగరూపిణీ! శివమంత్రాభిధా శైవీ మమాంగే సుప్రతిష్ఠతా!" "హ" శివబీజము. "ర" అగ్ని బీజము. ఇట్టి శివాగ్ని బీజ హరపరమాత్మకు నమస్కారము. మూల పంచాక్షరి యనగా ముఖ్య పంచాక్షరి అని అర్థము. అది యెట్లనగా విమలాగమమందలి పంచాక్షరీ కల్పమున శివుని సద్యోజాతాది పంచముఖములనుండి వివిధ పంచాక్షర మంత్రములుధ్బవించినట్లుగలదు.వీటన్నింటికీ మూలమైన పంచముఖములకు బీజస్థానీయమైనది "నమఃశివాయ" గాన నిది మూల పంచాక్షరియగును. దీనికి అంతమున 'ఓం' చేర్చినచో "నమశ్శివాయోం" అగును. అనగా స్థూల పంచాక్షరియగు 'నమశ్శివాయ'సూక్ష్మ పంచాక్షరి 'ఓం' తో తాదాత్మ్యము చెంది పంచాక్షరము లే కలదగును. గృహస్థులు మంత్రములకు ముందు ప్రణవము నుంచుకొని జపించుట భుక్తి ముక్తి ప్రదమనియు, విరక్తులు మంత్రములకు చివర 'ఓం' చేర్చి శీఘ్ర మోక్షమునకై జపింతురనియూ మన పూర్వ మంత్రశాస్త్రజ్ఞులహృదయమై యున్నది. ఇక శివాగ్ని బీజములగు 'హర' కు అంతమున 'ఓం' చేర్చిన "హర ఓం" - 'హరోం' అని యగును. ఈ ద్వివిధ మంత్ర వాచ్యుడగు శివపరమాత్మకు నమస్కారము. ఇంకొక మంత్రబీజమీ క్రింది విధముగ నుధ్ధరింపబడుచున్నది. శివాగ్ని బీజములగు 'హర'కు - ఓ మంతమనగా(ఓం అంతము) 'ఓం' తర్వాతి స్వరమగు 'ఔం' చేర్చి సమ్మిళితము చేయగా ' 'హ్రౌంఓం' అగును. ఈ విధము గ పై శ్లోకము నుండి - 'నమశ్శివాయోం', 'హరోం', 'హ్రౌంఓం' - అను త్రివిధములైన మంత్రములుధ్ధరింప బడుచున్నవి. లోకమున వేద పఠనారంభమున "హరిఃఓం" అనుట.నాచారముగనున్నది. కానీ శైవులు శైవ సాంప్రదాయానుసారముగా పైవానిలో నొకటి స్మరించి వేద పఠనము నారంభింప వలెనని సూచింపబడుచున్నది. మంత్రమర్మము లెరిగిన మన పూర్వీకులీకారణముచే నీ శ్లోకము నత్యంత ప్రాణప్రదముగా భద్రపరచుటను గుర్తించి యీ శ్లోకమును మార్చుటగానీ తీసివేయుటగానీ అల్పజ్ఞులు చేయరాదు. ప్రణవ పంచాక్షరి - పంచకోణము - లింగమూర్తుల కేకత్వము ప్రతిపాదించు చున్నట్టి పరావిద్యా స్వరూపిణి యగు శైవీ పరదేవత, తన సర్వాంగములయందు సుప్రతిష్ఠితమగుగాక యని చివరి శ్లోకార్థము ను ధ్యానమున శివభక్తుడు భావింపవలెను.
Subscribe to:
Post Comments (Atom)
-
SIVAPUJA VIDHI * ఓం శ్రీ గం గణపతయే నమః* * శివపూజా విధి* ప్రాతః కాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి గృహమున పవిత్ర స్థలమున పీటపై...
No comments:
Post a Comment